పోస్ట్‌లు

మ్యూజింగ్స్..2025

ఊబిలో దిగబడి బయట పడలేక సతమతం అవుతున్న వాడిని అక్కడే బయట  కూర్చున్న వాడు ఒకడు బయట పడాలి అంటే ఇలా చెయ్యి ,ఇలా చెయ్యి అని ఒకటే ఉదరకొడుతూ... తను చెప్పినట్లు విని వెంటనే అలా చేయనందుకు ఆ ఊబి లో పడ్డ వాడిని నానా రకాలా నిందిస్తూ వుంటే... అక్కడే దగ్గరలో ఉండి ఆ చోద్యం చూస్తున్న  మరొకడు ఈ సలహాలు ఇస్తున్న వాడి చూసి చూసి చిర్రెత్తి వాడిని కూడా అదే ఊబిలోకి తోసేసి... "ఇంతసేపు అతనికి పై ఎలా రావాలో తెగ ఊదర కొట్టావు కదా!! ఇప్పుడు నువ్వు అలా చేసి పైకి రా?" అన్నాడట. ఇలా నిజంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే... సలహాలు చెప్పినంత సులభం కాదు వాస్తవ పరిస్తితిలో ఎదురు అయే సంక్లిష్టతలు... సమస్యల వలయంలో ఇరుక్కుని దిక్కు తోచని వారికి కేవలం కంటి  తుడుపు చేతలు,  పై, పై మెరమెచ్చు  మాటలుతో సరిపెట్టక నిజాయితీ గా సహాయక హస్తం  కూడా అందించాలి. కానీ  వారిని ఊరికే ఇలా చెయ్యి, అలా చెయ్యి అని గది మేస్తూ, మనం చెప్పినట్లు చేయలేదని నిందించ కూడదు. ఎందుకంటే ఆ సమస్యలలో తల మునకలు గా ఉన్నవారి ఇబ్బందులు ఏమిటనేవి పై నుండి చూసే వారికి పూర్తిగా తెలియవు. అలాంటపుడు వారికిచ్చే ఉచిత సలహాలు, వారి పై ఇచ్చే త...

రాముని పై పద్యాలు

 1..ఇది రామతీర్థం రామచంద్రుని విగ్రహం తలను ఖండించిన రోజు వ్రాసినది. లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. దోషాలుంటే సవరించ ప్రార్థన. భావిని వృత్తము..ర/జ/ర గణాలు..UIU/IUI/UIU.. రామ తీర్థ మందు రామునిన్ బ్రేమ మీర గొల్చు వారికిన్ రామ యెంత వేదనో గదా  రామ శీర్ష ముత్త రింపగన్ ! రామ బంటు జూచుచుండగన్  రామచంద్రు పైన దాడియే !  స్వామి యాంజ నేయుడుల్కడే  రామరామ ! యెంత చిత్రమో ! క్రూర చర్యలిట్లు జేయగన్  ఊర కుండ నేల రాఘవా? వీరులై న నీదు తమ్ము లీ దారుణ మ్ము నెట్లు సైచి రో?? తల్లి సీత కండ్ల ముందరన్  లొల్లి జేసి నారె ధూర్తతన్  చెల్లి పోవు మీకు నూకలే ఒల్లవింక నిట్టి దోసముల్  ఆగ్రహాన హద్దు మీరి, మా  విగ్రహాల కూల్చు మూర్ఖులన్  నిగ్ర హింప దల్చి దేవుడున్ ఉగ్ర నారసింహు డౌనికన్! భక్త కోటి బావు రన్నదే భుక్తి పోయి యర్చకుండిలన్  శక్తి హీ నుడాయె నక్కటా త్యక్త మైన జీవి తేచ్ఛ తోన్ ! శూన్యమావహించు వేళలన్  అన్య చింతనమ్ము లేక, యే మాన్యు డైన నిన్ను గొల్చినన్ ధన్య మౌను జీవనమ్మికన్! దైవసేవ జేయు వారలన్ బ్రోవ రావె  రామ చంద్రుడా కావరమ్ము  జూపు నీచులన్ నీవె గూల్చ...

కృష్ణుడి పై కంద పద్యాలు

# కందములు వన్నెల దానా రాధా వెన్నెల వేళన ప్రియుడిటు వేడ్కన జేరన్ యన్నుల మిన్నా  యిట్టుల వెన్నుని  పై నలుక బూన  వెర్రది సుమ్మీ ఏమని చెబితివి యౌరా  భామిని నిను వీడనన్న బాసది యేడన్ లేమని ఒంటిగ నుంచన్ ఏమది భావ్యము బలుకగ యేలది రాదే సన్నగ నూయల  నూపగ కన్ని య మది గెలు వలేవు కామిని చోరా అన్నియు నెరిగిన దాననె నిన్నిక నిటు కల్ల లాడ నమ్మను కృష్ణా