కృష్ణుడి పై కంద పద్యాలు
# కందములు
వన్నెల దానా రాధా
వెన్నెల వేళన ప్రియుడిటు వేడ్కన జేరన్
యన్నుల మిన్నా యిట్టుల
వెన్నుని పై నలుక బూన వెర్రది సుమ్మీ
ఏమని చెబితివి యౌరా
భామిని నిను వీడనన్న బాసది యేడన్
లేమని ఒంటిగ నుంచన్
ఏమది భావ్యము బలుకగ యేలది రాదే
సన్నగ నూయల నూపగ
కన్ని య మది గెలు వలేవు కామిని చోరా
అన్నియు నెరిగిన దాననె
నిన్నిక నిటు కల్ల లాడ నమ్మను కృష్ణా
కామెంట్‌లు