మ్యూజింగ్స్..2025


ఊబిలో దిగబడి బయట పడలేక సతమతం అవుతున్న వాడిని అక్కడే బయట  కూర్చున్న వాడు ఒకడు బయట పడాలి అంటే ఇలా చెయ్యి ,ఇలా చెయ్యి అని ఒకటే ఉదరకొడుతూ...

తను చెప్పినట్లు విని వెంటనే అలా చేయనందుకు ఆ ఊబి లో పడ్డ వాడిని నానా రకాలా నిందిస్తూ వుంటే...

అక్కడే దగ్గరలో ఉండి ఆ చోద్యం చూస్తున్న  మరొకడు ఈ సలహాలు ఇస్తున్న వాడి చూసి చూసి చిర్రెత్తి వాడిని కూడా అదే ఊబిలోకి తోసేసి...

"ఇంతసేపు అతనికి పై ఎలా రావాలో తెగ ఊదర కొట్టావు కదా!!
ఇప్పుడు నువ్వు అలా చేసి పైకి రా?" అన్నాడట.

ఇలా నిజంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే...

సలహాలు చెప్పినంత సులభం కాదు వాస్తవ పరిస్తితిలో ఎదురు అయే సంక్లిష్టతలు...

సమస్యల వలయంలో ఇరుక్కుని దిక్కు తోచని వారికి కేవలం కంటి  తుడుపు చేతలు,  పై, పై మెరమెచ్చు  మాటలుతో సరిపెట్టక నిజాయితీ గా సహాయక హస్తం  కూడా అందించాలి. కానీ  వారిని ఊరికే ఇలా చెయ్యి, అలా చెయ్యి అని గది మేస్తూ, మనం చెప్పినట్లు చేయలేదని నిందించ కూడదు.

ఎందుకంటే ఆ సమస్యలలో తల మునకలు గా ఉన్నవారి ఇబ్బందులు ఏమిటనేవి పై నుండి చూసే వారికి పూర్తిగా తెలియవు. అలాంటపుడు వారికిచ్చే ఉచిత సలహాలు, వారి పై ఇచ్చే తీర్పులు, నిందారోపణలు వారిని మరింతగా బాధిస్తూ, వారిపై వత్తిడిని ఇంకా, ఇంకా పెంచుతాయి.

ఏమైనా చేయగలిగితే మానవత్వంతో, నిజాయితీ గా చేయటం, లేదా కావాలంటే  మన సానుభూతి ప్రకటించి అక్కడి  నుండి మౌనంగా తప్పుకోవడం అన్ని విధాలా ఉత్తమోత్తమం...19 th July 2025
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాముని పై పద్యాలు

కృష్ణుడి పై కంద పద్యాలు