రాముని పై పద్యాలు
1..ఇది రామతీర్థం రామచంద్రుని విగ్రహం తలను ఖండించిన రోజు వ్రాసినది. లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. దోషాలుంటే సవరించ ప్రార్థన. భావిని వృత్తము..ర/జ/ర గణాలు..UIU/IUI/UIU.. రామ తీర్థ మందు రామునిన్ బ్రేమ మీర గొల్చు వారికిన్ రామ యెంత వేదనో గదా రామ శీర్ష ముత్త రింపగన్ ! రామ బంటు జూచుచుండగన్ రామచంద్రు పైన దాడియే ! స్వామి యాంజ నేయుడుల్కడే రామరామ ! యెంత చిత్రమో ! క్రూర చర్యలిట్లు జేయగన్ ఊర కుండ నేల రాఘవా? వీరులై న నీదు తమ్ము లీ దారుణ మ్ము నెట్లు సైచి రో?? తల్లి సీత కండ్ల ముందరన్ లొల్లి జేసి నారె ధూర్తతన్ చెల్లి పోవు మీకు నూకలే ఒల్లవింక నిట్టి దోసముల్ ఆగ్రహాన హద్దు మీరి, మా విగ్రహాల కూల్చు మూర్ఖులన్ నిగ్ర హింప దల్చి దేవుడున్ ఉగ్ర నారసింహు డౌనికన్! భక్త కోటి బావు రన్నదే భుక్తి పోయి యర్చకుండిలన్ శక్తి హీ నుడాయె నక్కటా త్యక్త మైన జీవి తేచ్ఛ తోన్ ! శూన్యమావహించు వేళలన్ అన్య చింతనమ్ము లేక, యే మాన్యు డైన నిన్ను గొల్చినన్ ధన్య మౌను జీవనమ్మికన్! దైవసేవ జేయు వారలన్ బ్రోవ రావె రామ చంద్రుడా కావరమ్ము జూపు నీచులన్ నీవె గూల్చ...