1.వాలే పొద్దు
ఆగమన్నా ఆగదు!
పండు టాకు
చెట్టును వీడకమానదు!
కోట్ల డబ్బు చేతిలో,కోట్ల మంది వైద్యులు చుట్టూ వున్నా;-
నూకలు చెల్లిన వాడి ఉసురుని నిలపలేరు!!
2. రేపు లేని వైపుకు...
"అల తెలియని కడలి ఉంటుందా?
కల తెలియని కన్ను ఉంటుందా?
అల—శిలాచూర్ణ తీరంపై తల పగలగొట్టుకుంటుంది!
కల—కర్కశ వ్యవస్థల పాలపడి కాలి రాలుతుంది!
అలైనా, కలైనా...
రేపు లేని గమ్యం వైపు చేసే యానం మాత్రం;-
వాటి అస్తిత్వానికి అవే పాడుకునే చరమగీతం!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి