5, అక్టోబర్ 2026, సోమవారం

5.ఈ రోజు కమ్యూనికేషన్స్...

 కూడు,గూడు, లేక  అలో మని జనం అలమటిస్తుంటే మనకి అంతరిక్షం లో ప్రయాణాలు, స్పేస్  మీద పరిశోధనలు

అవసరమా?


"ఇస్రో ఏమి ఊడ బొడిచింది. స్పేస్ రీసెర్చ్ ఫండింగ్ వేస్ట్అ."ని చులకన గా మాట్లాడే వాళ్ళని ఏమి అనాలో నాకర్ధం కాదు.


ఈ రోజు  కమ్యూనికేషన్స్ ఇంతగా అభి వృద్ధి చెంది పల్లె ల లోకి కూడా మనం చేర గలుగుతున్నాము అంటే  ఉపగ్రహాల ద్వారా కాదా. రాకెట్ సైన్స్, రోదసి లోకి ఉపగ్రహాలు పంపటం వ్యర్ధమా.

అంతరిక్ష పరిశోధనల వలన, ఉపగ్రహాలను ఉపయోగించటం వలన భారత్ లాంటి పెద్ద దేశానికి కలిగే ప్రయోజనాలు ఈ రోజు మీకు వెంటనే తెలియక పోవొచ్చు. వాటి ఫలాలు మనం నిత్య జీవితం లో ఉపయోగిస్తున్నాం అనే స్పృహ లేక పోవొచ్చు.

కానీ భవిష్యత్ లో వాటి వల్ల  కలిగే బహుళ ప్రయోజనాలు ఊహకే అందని స్థాయి లో ఉంటాయి.

అంత పెద్ద దేశ మైన చైనా 2050 కల్లా 

స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ స్టేషన్స్ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది.

భూమి మీద సూర్య రశ్మి కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. అదే రోదసి లో అయితే అవిరామం గా సూర్య రశ్మి లభిస్తుంది. దానిని వినియోగించి పవర్ ఉత్పత్తి చేసుకుంటే దాని వలన వాతావరణ కాలుష్యం కూడా తగ్గి పోతుంది అని కాలుష్యం పెద్ద సమస్య  అయిన చైనా స్పేస్ నుండి పవర్ ఉత్పత్తి చేయటానికి  

చక చకా పావులు కదుపుతుంటే మనం  అసలు 

GPS సిస్టం ను, మొబైల్ ఫోన్స్, ఇంటర్ నెట్ పగలూ, రాత్రి తేడా లేకుండా వాడుతు ఎందుకొచ్చిన స్పేస్ రీసెర్చ్, ఉపగ్రహాలు అని మన శాస్త్రజ్ఞులని, పరిశోధన లని చులకన గా మాట్లాడుతున్నాము.

సమశీతోష్ణ మండలం వుంటూ, భూమధ్య రేఖ మీద ఉన్న మనకి సోలార్ పవర్ ఉత్పత్తి చాలా చక్కని  అవకాశం.  ఆ దిశ లో సాగే పరిశోధనలు

మనకి చాలా ఉపయోగకరం. దానికి నిధుల వినియోగం మంచిదే. ఆ పూర్వా పరాలు తెలుసు కోకుండా  దేనికొచ్చిన స్పేస్ రీసెర్చ్, ఉపగ్రహాల సాంకేతికత అనటం తొందర పాటే.

మనిషి ఎగర గలడా?? .ఎందుకొచ్చిన దండగ పని  అని ఆ రోజు ఆ పరిశోధన ఆపి ఉంటే ఈ రోజు విమానాలు సాధ్య పడేవా...

గ్లోబ్ లో ఎక్కడ ఏది జరిగినా ఈ రోజు మనకి ఎలా తెలుస్తోంది. వినగలుగు తున్నాం, చూడగలుగుతున్నాం.  బాగా మెరుగు పడిన సమాచార సరఫరా వ్యవస్థ ఎలా సాధ్య పడింది ఉపగ్రహాల వినియోగం వలనే కదా.

ఏ శాస్త్రీయ పరిశోధన ఏ కొత్త సాంకేతికత కూ, ఉపకరణాలు కి దారి తీస్తుందో. అది జన   బహుళ్యానికి ఎలా ఉపయోగ పడుతుందో మనం ఈ రోజే చెప్పెయ్య లేము. 

ఆశించిన ఫలితాలు వచ్చేవరకూ అకుంఠిత దీక్ష తో సాధిస్తూ సాధన దిశగా కొనసాగాలి. 

ఎలక్ట్రిక్ బుల్బ్ కనిపెట్టటానికి ముందు ఎడిసన్ ఎన్నో సార్లు విఫలం అయ్యాడు. అయితే " నా ప్రతి వైఫల్యం నుండీ ఆ పని ఎలా చేయ కూడదు అనే దానికి సంబందించిన కొత్త అంశం నేర్చు కున్నాను." అన్నాడు.

శాస్త్ర పరిశోధన లో వైఫల్యాలు ఉంటాయి. అంత మాత్రాన వాటి లో పెట్టు బడులు వృధా అనే వాళ్ళకి ఒక నమస్కారం.

ఈ రోజు  దేశం లో నిరుపేదలకు చేయాల్సింది చేయాలి. గ్రామాలు అభివృద్ధి చేయాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. ఎవరూ కాదనరు.

వాటి కి ముందు నిధులు వినియోగించాలి అని ఉన్నవన్నీ వాటికి పంచి పెట్టి, భవిష్యత్ లోనయినా ఈ పరిస్థితి మార్చటానికి అవకాశం ఉన్న దారులు మూసి వేస్తే ఎప్పటికీ ఇక్కడే ఉంటాం. చీకటి, అజ్ఞానం లోనే మగ్గుతాము.

శాస్ట్రీయ దృక్పధం, సరి అయిన తర్కం, హేతు బద్ధత లేకుండా ప్రతి దాన్ని విమర్శిస్తూ , వ్యక్తి వైఫల్యాల కి వ్యవస్థ ను నిందించే ధోరణి తో మనం ఏమి సాధించ లేము. వ్యక్తి సంస్కారం, పని సంస్కృతి లేని చోట పురోభి వృద్ధి అసాధ్యం.

ఎటువంటి అభివృద్ధి నిరోధక భావాలకు లోబడక  శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ వచ్చే ఫలాలు జన హితానికి ఉపయోగ పడే తీరు లు అన్వేషించటం. మన దేశానికి తప్పని సరి అవసరం.  

వ్యక్తులు గా ముందు పరిణితి రావాలి. మన ప్రాధాన్యాలని నిర్ణయించు కోవాలి. ఏది మన వ్యక్తి వికాసానికి, 

వ్యవస్థ హితానికి పనికి వస్తుందనే కనీస స్పృహ లేకుండా  లేకుండా అవాంఛిత భావ జాలాలు ను నేటి తరాల్లో  పాదు కొల్పి వారి లో ఆవేశ కావేశాలు రెచ్చ గొట్టటము మానాలి.

అయితే ఏది ఉచితం, ఏది అనుచితం అనే స్పృహ నేడు చదువుకున్న వారి లోనే లోపిస్తున్న సందర్భాలు కన

బడుతున్నాయి. అదే మన దేశం లో

పెద్ద విషాదం. 

ఈ దేశం లో వాక్స్వాతంత్రం పిచ్చి వాడి చేతి రాయి లా ఉంది. దాని దెబ్బ ఎక్కడ ఎలా తగులు తుందో చెప్పలేని అయోమయం. ఫలితం గా

నిర్మాణాత్మక కార్య నిరోధం, విలువైన వనరుల వ్యర్థం, దాని వలన ఆశించిన  స్థాయి లో అభివృద్ధి కొరవడటం మన కళ్ళ ముందు వాస్తవం.

నేను అంతరిక్ష పరిశోధన కి,ప్రయాణానికి అన్ని నిధులు ఖర్చు పెట్టమన లేదు..

ఆ రంగం లో మన వెసులు బాటు బట్టి కొనసాగడం మంచిదే.

దానిలో పెట్టటం తెలివి తక్కువ పని అనటం ని సమంజసం కాదు అంటున్నా..

అలాగే అన్నీ వేదాల్లో ఉన్నాయనటం లేదు..వాటి లో ఏముందో, లేదో తెలియ కుండా చులకన గా మాట్లాడట మంచిది కాదు అంటున్నాను.


ఈ తరాలు వాళ్ళకి వాళ్ళు ఆసక్తి ఉంటే చదివి ,విశ్లేషించి వాస్తవాలు తెలుసుకుంటారు..ఈ లోపల మనం సరిగా అధ్యయనం చేయకుండా మన భావ జాలాలు, వ్యాఖ్య లతో ఈ తరాల మనసులు కలుషితం చేయటం సరి కాదు అంటున్నా.


అంతే గానీ నేను బీదల కడుపులు కొట్టి స్పేస్ రీసెర్చ్ కి ఖర్చు పెట్ట మనటం లేదు.


ప్రాధాన్యత లు నిర్దేశించుకుని ఖర్చు చేయాలి..

అంత మాత్రం చేత విజ్ఞాన వేత్తల కృషి, పరిశోధనల ని గురించి చిత్తం వచ్చి నట్లు మాట్లాడటం 

సమర్ధనీయం కాదు అన్నది పూర్తిగా నా వ్యక్తి గత అభిప్రాయం మాత్రమే.



కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...