విష్ణు భక్తులు సాత్వికులు. శివ భక్తులు లో మూర్ఖత్వం, హింసా ప్రవృత్తి ఎక్కువ నాకు బాగా సన్నిహిత మిత్రురాలు సమయం వచ్చినప్పుడల్లా నాతో అంటూ ఉంటుంది. ఆవిడ దృష్టి లో నేనో మూర్ఖురాలిని...
నేను శివ తత్వాన్ని, తత్త్వాన్నీ ఇష్ట పడతాను. గమనించ గలరు.
సరే నోములు, వ్రతాలు, పూజలు, పునఃస్కారాలు నా జీవితం లో పెద్దగా ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడూ నిత్య దీపం పెట్టటం తప్ప ఏమీ చేయటం లేదు.అంతకు మించి ఏదో చేయవలసిన అవసరం ఉంది అనే భావన నాలో ఎప్పుడూ లేదు. సరే..మా ఇద్దరినీ అలా పక్కన పెడితే..
చాలామంది లో అసలు సమస్య ఆరాధనా తీరులలో, విశ్వాసాల కు సంబంధించి తమ విధానాలు ఇతరుల కన్నా గొప్పవి అని చెప్పు కోవటం, ప్రదర్శన, ప్రచారం చేసుకోవటం లక్ష్యం.
మా గురువులు, మా మత గ్రంధాలు, మా విశ్వాసాలు మహా అద్భుతం. మిగిలిన వారి తీరు తెన్నులు పరమ నికృష్టం అనే ఈ సంకుచిత ధోరణి మనుషులలో పుటం పెట్టినా మనిషి లోంచి పోదు లా ఉంది.
పై మిత్రురాలు కి శైవులు, వైష్ణవులు మేమే గొప్ప అంటే మేమే గొప్ప అని పీకలు కోసుకుని వీరంగాలు వేసుకున్న ఘటనలు చరిత్రలో ఉన్నాయని తెలియదు. చెప్పినా వినదు.
మాటవరసకి గరికి పాటి వారు ఈ మత విశ్వాసాల పట్ల మూర్ఖత్వాలకి, గుడ్డి నమ్మకాలు కి ఏ మతం, ఏ దేశం, ఏ జాతి అతీతం కాదు అన్నారు అనగానే..
ఆవిడ..
ఆయనేమి సవ్యం అయిన వాడా. ఆయన చెప్పింది ఆయనే పాటించడు. ఆయన ఉత్త వేస్ట్.
ఆయన మీద చాగంటి వారు చెప్పేది మంచిది.చాగంటి వారు చెప్పిందే ఎక్కువ మంది అనుసరిస్తారు.
ఆమెతో వచ్చిన మరో మహానుభావుని ఉవాచ చాగంటి, గరికి పాటి లాటి ప్రవచన కర్తలు, సద్గురువు జగ్గీ వాసుదేవ్, రవిశంకర్ లాటి గురువులు వలనే సమాజం మట్టి గొట్టికుపోతోంది.వీళ్ళందరినీ వరసగా నిలబెట్టి షూట్ చేసి పారేయాలి.అప్పుడే యువత బాగుపడుతుంది అన్నాడు ఆయన.
ఇలా అందరినీ చులకన చేస్తూ చేసే వ్యాఖ్యల వలన నేటి తరాలకు ఎవరి పట్లా గౌరవం లేకుండా చేస్తున్నాం..
ప్రముఖులను, జాతి నిర్మాతలు ను రకరకాల గా అనుచిత విమర్శలు చేస్తూ తమ లో డొల్ల తనం పైన పెట్టు కోవటమే కాక, భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతలు లేకుండా చేస్తూ, సంకుచిత ధోరణులను వ్యాప్తి చేస్తున్నాం అనే కనీస జ్ఞానం లేని దౌర్భాగ్యం మన పౌరులది.
ఒకరిని కించపర్చటం లో మనం ఆత్మ తృప్తి పొంద వచ్చునేమో కానీ ఆ తీరుతో మనం మనకి, మన రేపు లకు చేస్తున్న కీడు ఇంతా అంతా కాదు నా దృష్టి లో.
వ్యక్తి చెప్పిన 99 మంచివి చెబితే అవి వదిలేసి వారి లో ఒక దోషాన్ని ఎంచి అదే అతిగా వ్యాప్తి చేసే ఈ దుష్ట సంస్కృతి కి అంతు ఎప్పుడో మరి కానీ...
ప్రతి మనిషి లో మంచి, చెడూ ఉంటుంది. ఎవరూ పరి పూర్ణులు, దోష రహితులు కాదు.
ఏ విధానం, భావ జాలం, సిద్దాంతం పూర్తిగా దోష రహితం కాదు అన్న ఇంగితం లేకుండా నోరుంది కదా అని వ్యక్తుల వదరు బోతు తనం ప్రదర్శన..ఇది సంస్కార హీనుల లక్షణం. మన దేశ పౌరులలో నిత్యం మనకి కనిపించే లక్షణం. ఇది మన జాతీయ సంస్కృతి. చికిత్స లేని రోగం ఇది మన పౌరులకి..
ఈశ్వరా నువ్వే మాకు ఇంగితం ప్రసాదించు అనటం మినహా ఈ రోగం విషయం లో ఏమి చేయలేము..అని తెలిసినా..
అయినా వేళ్ళు ఊరు కోక.. ఇలా..ఇక్కడ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి