🌹🌹గరిక తిన్న గాడిద చస్తుంది.
గరిక చావదు. నరికినా మళ్ళీ చిగిర్చి పశువులకు పోషకవిలువలు నిండిన మేతగా వినియోగ పడుతుంది.🌹🌹
ఈ మధ్య శ్రీమతి కామేశ్వరి గారు చెప్పిందంతా విని కూడా..
అంతలా బ్రహ్మశ్రీ గరికిపాటి వారిని ఆహా, ఓహో అన్న నువ్వు...
అదే శ్రీమతి కామేశ్వరిగారు
బయటికి వచ్చి ఉపన్యాసాలు, ప్రవచనాలు చెబితే వింటావా అని నా పై ముదరకింపు.
ఎందుకు విననూ? వింటాను. ఆమె చెప్పే విషయంలో తన, జన హి తా నికి, లోక కళ్యాణానికి ఉపయోగ పడే అంశాలు వుంటే అవన్నీ అర్థం చేసుకుంటాను. వింటాను.
చెప్పానుగా మాట్లాడే వ్యక్తి వ్యక్తిగతం, నేపథ్యం కాదు అతడు లేదా ఆమె మాట్లాడే మాట లో పస వుందా లేదా.అది పనికి వచ్చేది అవునా కాదా అన్నది మాత్రమే నాకు ముఖ్యం.
ఇక అతను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా, స్త్రీని అణగ దొక్కేందుకు మగ దురహంకారము ను ప్రదర్శించినా అతన్ని నెత్తిన పెట్టుకున్న లోకం...
ఆమె మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆమె మీద విరుచుకు పడి ఆమెని తక్కువ చేస్తోంది. సంప్రదాయ చట్రాలలోంచి చూసి తీర్పులిచ్చే స్తోంది.నువ్వు కూడా అలాటి దానివే అన్నది నామీద అభియోగం.
పై వ్యక్తుల పెళ్లిళ్ల వెనక వాస్తవాలు కానీ,వారి సహజీవనం లో ఎవరి వల్ల ఎవరు బాధితులు అన్నది కానీ ప్రపంచానికి తెలియ కుండా తీర్పులు ఇవ్వటం ఎవ్వరూ చేయకూడదు.
కానీ ఇక్కడ వారిలో ఒకరు ఇల్లెక్కి కోడై కూస్తుంటే ఆ కూతకి జనం దృష్టి అటు మరలింది. ఇద్దరి వెర్షన్ తెలియకుండా తీర్పులు వెలువడ్డాయి.
అయితే తనకి నీడ ఇస్తున్న చెట్టు ఎండిపోతున్నపుడు పాపం స్త్రీ ఏమి చేస్తుంది తను కన్న పిల్లలని కూడా ఆ ఎండుతున్న చెట్టు కింద వదిలేసి మరో చెట్టు నీడ కి తను వెళ్ళిపోతుంది అన్న అమెగారి మాటలు మన స్త్రీ వాదులకి మహా అద్భుతం గా తోచాయి.
చదువు సంధ్య, ఆర్థిక స్తోమత లేని స్థితిలో భర్తను ఏదో కారణం గా కోల్పోయినా, ఏ ఆధారం లేక పోయినా తరువుకు కాయ భారమా అని...
వాళ్ళు నన్ను పుట్టించ లేదు. నేను వాళ్ళని కన్నాను. కన్నాకా చావు అయినా, రేవు అయినా ఈ అభం, శుభం తెలియని పిల్లలు నా బాధ్యత అని ఎన్నో ఒడిుడుకులను, కష్టాలను అధిగమించి పిల్లలను పెంచి పెద్ద చేసిన స్త్రీ మూర్తులు ఈ ప్రపంచం లో ఎందరో.
అలాటిది చదువు వుండి ఆనాటి సమాజ నేపథ్యం లో సంప్రదాయ కుటుంబాలు చట్రాలలో వుండే కట్టు భాట్లు, ఇబ్బందులు తనకి వున్నాయని..వూపిరి సలపక
వెళ్లిపోయిన ఆమె ..
పుట్టింటి వారు కలిగిన వారు అయి వుండిన పరిస్థితిలో కూడా...
పిల్లలను వదిలేసి తనకి నచ్చిన వ్యక్తితో వెళ్ళి పోయి నచ్చిన తీరులో తాను వుండదలుచుకున్న ఆమె 23 ఏళ్ళ తరవాత వచ్చి వీరంగం వేయటం ఇక్కడ
నేను సమర్ధించలేను.
చలం మైదానంలో రాజేశ్వరికి ఈమె కి ఏ మాత్రం పోలిక లేదు. రాజేశ్వరి అమీర్ తో వెళ్ళి పోయాక తిరిగి తన భర్త వైపు చూడలేదు. అమీర్, మీరా లిద్దరినీ ఏక కాలం లో ప్రేమించిందే కానీ తనకు తానుగా ఎవరినీ నిందించలేదు. రాజేశ్వరి లో నిబద్ధత కామేశ్వరిలో లేదు.
అందుచేత వారిద్దరినీ సరిపోల్చటం నా దృష్టిలో భావ్యం కాదు.
ఇరుకు గదుల్లో, లేమి లో, ఉక్క పోత లో , వూపిరి సలపని తనంలో సంప్రదాయ చట్టా లలో ఇరుక్కు పోయి మగ్గి పోమని ఎవరూ ఎవరికీ చెప్పరు. హింసను, అణచి వేతను ఎదుర్కొని బయటికి వచ్చి స్వేచ్చగా బతక మనే
స్త్రీ పురుషు ఇద్దరికీ నేడు చెబుతున్నది.
అయితే బాధ్యత లేని స్వేచ్ఛ ను ఏ సమాజం ఆమోదించదు.
ఇంటి బాధ్యతలు నెరవేర్చి వివేకానందులు తన ఎంపిక సన్యాస మార్గం స్వీకరించారు. ఆతీరు మనకి మార్గ దర్శకం కావాలి.
భార్య తో కుదరక విడి పోయినా బాధ్యతలు విస్మరించకుండా పిల్లలని తీర్చి దిద్ది ప్రయోజకులను చేస్తూనే తాను ఎంపిక చేసుకున్న దారిలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు గరికి పాటి.
ఆ లక్షణం మనకి కరదీప్తి కావాలి.
గరిక తిన్న గాడిద చస్తుంది. గరిక చావదు. ఎంత నరికేసినా మళ్ళీ చిగుర్చి పచ్చగా ఎదిగి పశువులకి పోషక విలువలు కలిగిన మేత గా తన జన్మ కు అర్థం ,పరమార్థం సాధించుకుంటుంది...
ఆ విషయం లో గరిక, బ్రహ్మశ్రీ గరిక పాటి నాకు ఆదర్శం..అని చెప్పటానికి నాకు ఏ సంకోచం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి