8, అక్టోబర్ 2026, గురువారం

కొన్ని సంఘటనలు చూసాకా..

 కొన్ని  సంఘటనలు చూసాక సభ్య సమాజం తనదైన రీతిలో సున్నితం గా

స్పందించటం జరుగుతుంది. దానికి అలా స్పందించిన వారి పై ముద్ర వేసే వారికి ఓ నమస్కారం చేస్తూనే..నా భావన వ్యక్తీకరిస్తున్నాను...

జిడ్డు కృష్ణమూర్తి గారు జనం ఎక్కువగా వుండి అలజడి గా ఉన్న ప్రదేశం లో మాట్లాడటానికి చిరాకు పడి విసుక్కున్న సందర్భాలు ఉన్నాయి.

టీఆర్ మహాలింగం ఫ్లూట్ గొప్ప  ఫ్లూటిస్ట్ విజయనగరం కళాశాల శత దినోత్సవ వేడుకల సందర్భం గా ఆహ్వానించబడి వేదిక మీద కార్యక్రమం మొదలైన కాసేపటికే జనం గోల కి ఏకాగ్రత చెదిరి చిరాకు పడి నేను ప్రోగ్రామ్ చేయను అని వెళిపోయారు.

ఐంస్టీన్ ని ఉపన్యాసం ఇమ్మని ఆహ్వానించి అక్కడ ఫోటోలు, మీడియా హడావుడి చేస్తే ఉపన్యాసం సాగదు.

విశ్వనాథన్ ఆనంద్ ని వేదిక  మీద చెస్ ఆడమంటే విసుక్కుంటాడు.

మేధో పరమైన విషయాల వినియోగం జరగవలసిన చోట జనం గోల, మీడియా అతి ఏకాగ్రత చెదరకొడతాయి అన్న స్పృహ మన సగటు పౌరులకి,  మీడియా వారికి లేక పోవడం దురదృష్టం.

శ్రీ గరికిపాటి వారు ప్రతి వేదిక మీద చెబుతారు నాకు దండలూ, దండాలూ వద్దు. నేను చెప్పేది విని వీలయితే ఆచరించండి. అలా వినే ఓపిక లేక పోతే చెప్పండి నేనే వెళి పోతాను అని ఆయన అనటం పరిపాటే.

నిజమే అలా ఏకాగ్రత చెడుతూ ఉంటే మాట్లాడటం కష్టం. అందుచేత నేను మాట్లాడాలి అంటే అక్కడ ఆఫోటోల హడావుడి వద్దు అన్న మాటే..

నిన్న చిరంజీవి గారి తో ఫోటోలు దిగుతున్నపుడు కూడా  చెప్పారు.

చిరంజీవి గారు మీకు విజ్ణప్తి చేస్తున్నా మీరు ఆ ఫోటో ల కార్యక్రమం అపి వచ్చి కూర్చోండి అన్నారు.

నిజానికి ఈ అభిమానుల అతి, తాకిడి కి  కూడా ఇబ్బంది పడే సందర్భాలు  శ్రీ చిరంజీవి గారికీ నిత్యనుభవమే. 

అందుకే ఆయన వెనక్కి వచ్చేసి ఎంతో సంయమనం తో కార్యక్రమ నిర్వహణ కు తన వంతు తాను చేశారు.

ఇక్కడే కాదు ఎక్కడైనా చిరంజీవి సౌమ్యత,సంస్కారం, సంయమనం తో వ్యవహరించటం మనకి సుపరిచితమే. 

వారి వినయపూర్వక ప్రవర్తన అంటే నాకు చాలా ఇష్టం కూడా. దానికి ఎవరు ఏ పేరు పెట్టినా నేను ఆవేశ, కావేశాలు అనర్థదాయకం అని నమ్మి ఆచరించే వ్యక్తిని కాబట్టి నాకు చిరంజీవిగారు తీరు చాలా ఇష్టం. ఈ తరాలు

ఆయనని చూసి ఆ వినయం, ఆ అంకితభావం తో కష్టపడే తత్వం నేర్చుకోవాలి అని నా అభిప్రాయం.

అలాగే  బ్రహ్మశ్రీ గరికిపాటి వారు విద్వన్మణి. అయితే వారి ఏకాగ్రత చెదిరే పరిస్థితి లో కాస్త తీవ్రం గానే స్పందిస్తారు. అది మేధో పరమైన అంశాల లో నిపుణు లైన వారి లో సహజం గా కనబడే లక్షణమే. అందుచేత ఆ సరస్వతీ పుత్రుని గూర్చి  ఈ విషయం లో అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సబబు కాదు.

గతం లో విశ్వనాధవారు, సి నారాయణ రెడ్డి గారు, ఇంకా ఎందరో ఇలా మేధో పర వ్యవహారాల్లో నిష్ణాతులు ఏకాగ్రత కు  భంగం కలిగించే పరిస్థితు లు వేదికల పై , లేదో జన సమూహాల మధ్య వారికి కలిగినపుడు అసహనము ప్రదర్శించటం మనకి కొత్తకాదు.

ఈ విషయం లో అక్కడిక్కడే వారు ఇరువురూ ఆ సమస్య నుపరిష్కరిం

చుకున్నాక కూడా నాగబాబు గారు రాముడి వెంట లక్ష్మణ స్వామి లా ఆవేశపడి ఓ ట్వీట్ పెట్టారు. అదీ సహజమే. తన అన్న గౌరవానికి భంగం కలిగితే తమ్ముడు వూరుకోడు. 

అక్కడితో అది ఆపేయాలి కదా..

కానీ మన మీడియా  దివాలా కోరు తనం అలా చేయనివ్వదుగా..అందుకే

అదే పనిగా ఉదర కొడుతున్నారు..టీ కప్పులో ఈ తుఫాను కి ఇంత హడావుడి అవసరమా...

అద్భుతమైన ఆవిష్కరణలకు, మహోన్నత ఆశయాల కోసం కృషి చేసిన వారికి నోబెల్ ప్రైజ్ లు 2022  నిన్ననే ఇచ్చారు. వాటి గురించి, వారు చేసిన కృషి గురించి ఈ మీడియా లో న్యూస్ ప్రసారానికి ఎంత సమయం వినియోగించారు మీడియా. ఓ సారి ఆలోచించండి. 

జనాన్ని జాగృతం చేసి వారి లో అవగాహన పెంచుతూ, చైతన్య పరచవలసిన మీడియా ఘటన లకి రంగుకు పూస్తూ, తమ వైన ముద్రలు వేస్తూ, ఈ అనవసర చర్చలతో , పనికి మాలిన వార్తలతో పొద్దు పుచ్చుతూ, జనం బుర్రలు పుచ్చి పోయేలా చేయటం మాని...కాస్త ఆత్మవిమర్శ, తమ విధానాలను పునఃసమీక్ష చేసుకునేలా చేయమని ఆ ఈశ్వరుని వేడుతూ...

ఈ అతి వ్యక్తి పూజ మాని, ప్రతి చిన్న దానికి ఆవేశం తో రెచ్చిపోయి ఆత్మాహుతి దళాలు అయి పోక ప్రముఖుల అభిమానులు వాళ్ళ, వాళ్ళ చుట్టు వుండే వాళ్ళ జీవితాలు, పరిసరాలు సవ్యం గా ఉంచడానికి ఏమి చేయాలో ఆలోచించగల, ఆచరించగల విజ్ఞత ను  పెంపొందించుకుంటారని అనే ఒక దింపుడు కళ్లెం ఆశ తో ...


కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...