8, అక్టోబర్ 2026, గురువారం

అదీ సంగతి... ధృవ్ రాతీ...

 అదీ సంగతి...

​"ధృవ్ రాతీ నేడు ఇండియాలో ఈ బెంగుళూరు కి ఎందుకు వచ్చాడో చెప్పాడు వినండి. కాక్రోచ్ జనతా పార్టీ కి మద్దతు ఎందుకు ఇస్తున్నాడో అర్ధం చేసుకోండి...

​మీలా అతన్ని నేను "వాడు" అనలేను కానీ...

మీ మాటల్లో మీ స్పందన ఈ క్రిందన:

"అబ్బో! వాడు చెప్పటం... పనిలేని నువ్వు విని, ఇలా పనికిమాలిన పోస్టులు రోజంతా పెట్టటం... బ్లా... బ్లా... బ్లా..."

​ఒరే బాబూ! నాకు పని లేకపోవటం ఏమిట్రా?

నేను రోడ్లెక్కి, FB లో చిల్లర పోస్టులు పెట్టటం ఏమిట్రా సన్నాసుల్లారా?

​రోజంతా నా ఇంట్లో పనులు చేసుకుంటూనే...

ఆక్వేరియంలో చేపలా నా ఇంట్లోనే నేను తిరుగుతూనే...

ఒక పని అవ్వగానే FB లోకి తొంగి చూసి, ఎదురైన పోస్ట్ చదవటం... ఏదో తోచిన తీరులో స్పందించటం చేస్తాను.

​అయితే ఆ చేసేది నేనే ఎక్కడో చదివి, ప్రభావితం అయిన తీరులోనే చేస్తూ ఉంటాను.

​అదేమిటో ఈ క్రింద చూడండి:

​చీము, నెత్తురు ఉంటే... ఉచ్ఛం, నీచం తెలిస్తే... పోరాడు!

పోరాడితే పోయేది బానిస సంకెళ్లే కదా!

అన్యాయాన్ని, అణచివేతను ఎదిరించి పోరాడు!

​పోరాడలేకపోతే... మాట్లాడు!

మాట్లాడలేకపోతే... రాయి!

రాయలేకపోతే... కలిసి నడువు!

నడవలేకపోతే... నడిచే వారిలో ఆత్మవిశ్వాసం పెంచు!

అదీ చేయలేకపోతే... కనీసం చేసేవాళ్లకు అడ్డు తగలకు!

​ఎందుకంటే, వాళ్లు చేస్తున్న ఆ పోరాటంలో నీ పాత్ర కూడా వాళ్లే పోషిస్తున్నారు.

నీ హక్కుల కోసం పోరాడే వారికి నువ్వు వెన్నుపోటు పొడవకు!

​కట్టప్పా...

బాహుబలులను చంపకు!

భావి తరమును తుంచకు!

08-10-2026

కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...