మీకు నచ్చక విగ్రహం తొలగిస్తే సరే..
వాటిని విరిచెయ్యటం, కాళ్ళతో తొక్కటం, నిప్పు పెట్టటం..ఇవి సబబా.
ఇవి విపరీత ధోరణులు కాదా??
మళ్ళీ విగ్రహం తీస్తే మీకేం అని ప్రశ్నిస్తారు. భద్రం గా ఇళ్ళల్లో కూర్చున్న ,ఇలా fb ల్లో పోస్ట్లు పెట్టుకునే మీ, మా లాటి వారికి సమస్య లేక పొవొచ్చు. కానీ కొందరికివే
ప్రాణాంతకాలు గా పరిణమించవచ్చు..
జన బహుళ్యం అన్ని వేళలా విషయ విశ్లేషణ, యుక్తా యుక్త విచక్షణా కలిగి వ్యవహరిస్తారు అని అనుకోలేము కదా. ఏ బుర్రలో ఎవరి కి ఏ విపరీత బుద్ధి పుట్టి తీవ్రం గా స్పందిస్తారో, సంయమనం కోల్పోయి, భగ్గు మంటారో ఎవరు చెప్పగలరు.
ఒక చోట గీసి పడేసిన అగ్గిపుల్ల రాజుకుని ఎగిసే మంటలు ఎలా, ఎటు వ్యాపించి దహిస్తాయో..ఆ గుడుల్లో నిత్యం పూజలు చేసేవారికి, బయట భావోద్వేగాలు రెచ్చ గొట్టే వారికి తెలియదా.. అంత అమాయకు లా ఇలాటి చిచ్చులు రగిల్చే వాళ్ళు.
చదువు సంధ్య వుండి ఆ మాత్రం అవగాహన వున్న వారే అతిగా వ్యవహరిస్తూ వుంటే..
అవేవీ లేని అంధ భక్తులు, మూఢులు
ఎలా స్పందిస్తారు అనేది కనీసం ఆలోచించలేరా??
ఈ విగ్రహం వుంచినా, తొలగించి మరో విగ్రహం..పెట్టినా, లేకపోయినా పెద్ద సమస్య కాదు. అలాగే దైవం సర్వ వ్యా పకుడు అనో, లేదా అసలు దైవం లేడు అనో ఒక దండం పెట్టీ తమ పని తాము శ్రద్ధగా చేసుకునే వాళ్ళ తో ఏ సమస్యా లేదు..
ఇదిగో ఇలా మీ దేముడు, మా దేముడు, మా పద్ధతి, మీ పద్ధతి అని పేచీ లకి దిగేవారి తోనే అసలైన సమస్య.అదే కదా నాగరికత మొదలైన నాటి నుండి నేటి వరకూ కొనసాగిన, సాగుతున్న రక్త చరిత్ర..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి