19, అక్టోబర్ 2026, సోమవారం

మా అత్తగారు ఆ దిక్కు మాలిన

మా అత్తగారు  ఆ దిక్కుమాలిన కొన్న చారుపొడి, సాంబారు పొడి వెయ్యకు. నేను నీకు చెప్పినట్లు ఇంట్లో చేసి వెయ్యి. చారు, సాంబారు కమ్మగా వస్తాయి అనేవారు. అలాగే అత్తయ్య గారూ మీరు చెప్పినట్లే  ఇంట్లో చేసినవే వేసాను.  అనేసే దాన్ని. కానీ కొన్న పొడులు  వేసేసి వాటిలో ఘాటు చాలదని వేరే గా మరి కాస్త ధనియాలు, మిరియాల పొడులు, అవీ కొన్నవే పడేసి..

ఇంత పోపు వేరే  మూకుడు లో వేసి దానిలో కాసిన్ని నీళ్లు పోసి రెండు నిముషాలు మరగ బెట్టి సాంబారు, చారు లలో తిరగ మోత పెట్టేసే దాన్ని..


చూసావా పొడులు ఇంట్లో చేస్తే ఎంత బాగా, రుచి గా ఉంటాయో చారు, సాంబారు అనే వారు.


ఆవిడ వండిన పదార్థం పాత్ర లో వుండగానే ఉప్పు పడాలి, పులుపు తక్కువైంది, మరి కాస్త వేగాలి, ఇదేమిటి రంగు రాలేదు. అన్నం బిరుసు అయింది 

మరి కాస్త నీళ్లు పోయాల్సింది, అదేమీ నీళ్ళు ఎక్కువ పో సావు జావ అయిపోయింది అనీ...


ఎలాగైనా వంట ఆవిడ చేతిలోకి తీసుకుంది ఇలాటి చాలా టెక్నిక్లు వాడుతారు.


అయినా నేనూ, మా ఆడపడుచు బాలా ఎత్తు కు పై ఎత్తు లు వేసి ఆవిడ ను స్టవ్ దగ్గరికి రానీ కుండా...నిరంతరం కాపాలా కాస్తుంటాం.


వెధవ వంట.రుచీ, పచీ లేదు. ఎప్పుడు మీకు వండటం వస్తుంది అంటారు...


మేము ఈ రోజుల్లో అన్నీ కల్తీ సరుకు. ఎరువులు వేసిన పంటలు. మీరు వండినా ఇలాగే ఉంటాయి రుచులు అని సునాయాసం గా నింద వేరే వాళ్ళ మీదకి నెట్టబోతే...


మా అత్తమ్మ తక్కువా...మాకన్నా పదాకులు

ఎక్కువ చదివారు...


బాగానే ఉంది సంబడం... మీలాటి చేతకాని కుంకలే తలపాగా చుట్టటం రాక తల వంకర అన్నారుట... అనీ...


మేము వంట చేతకాని వాళ్ళం అని తిరుగులేని ముద్ర మా మీద రోజూ వేస్తారు...


ఏమిచేసినా అత్తయ్య గారు మమ్మల్ని ఓకే, పాస్ అయ్యారు అనరు కనక...


ఇక అక్కడ శ్రమ ఎందుకని పొడులు, అప్పడాలు, వడియాలు, చల్ల మిరపకాయలు లాటివి మరి కొన్ని బజారులో కొని ఇంట్లో చేసాం అని మా అసత్య  వ్రతం నిరాటంకం గా కొనసాగిస్తున్నాం అనుకోండి..🤣🤣

కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...