నిన్ను పూజించిన వారి స్థాయి బట్టి నీ విలువ
స్వగృహే పూజ్యతే మూర్ఖః
స్వ గ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజాః
విద్వాన్ సర్వత్ర పూజ్యతే
అన్నది ఎవరో నాకు గుర్తు లేదు...పై అభివ్యక్తి లో తప్పులు వుంటే సవరించండి fb లో సోదర, సోదరీమణులారా...మరోలా భావించకండి...
సర్వత్ర పూజింప బడే వారు అరుదుగా వుంటారు.
అలాటి నాయకులు ఒకప్పుడు మనకూ ఉండే వారు.
ఇప్పుడు మన వున్న ప్రాంతం, మన ప్రయోజనాలు బట్టి మనం పూజించే వ్యక్తులు, వ్యవస్థలు.
అందుచేత ఈ పూజ పునఃస్కారాలు ఎవడి అవసరాన్ని, తప్పని సరి తనాన్ని బట్టి వాడు చేసుకునే నేపధ్యంలో నేను పూజ చేయమంటే, దీపం పెట్ట మంటే , స్తోత్రం చేయ మంతే, భజన చేయ మంటే నువు చేయ లేదు అంటే...
అన్నీ నువు మంటే అంటుంటే...నాకు నిలువెల్లా మంటే ...అందుచేత అల్లా అనకు...
Respect can't be demanded. One needs to earn it through one's own earnest words and deeds.
ఇంట్లో తండ్రి తీరు సరిగా లేక పోతే యుక్త వయసు వచ్చిన పిల్లలు తండ్రిని ఎదిరిస్తారు. నిలదీస్తారు.
దేశంలో తమకన్న ఎంతో అనుభవం, వయసు లో ఎంతో పెద్ద అయిన పాలకుల తీరులను అలాగే యువత గమనించి నిలదీస్తారు.
ఆ యువత కి ఆ భాష, ఆ వాదించే, ఎదురు తిరిగే తత్వం ఎక్కడి నుండి వచ్చాయి.
చైల్డ్ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ఫాదర్ అంటారు...
బిడ్డ తండ్రి లేదా తల్లి ప్రతి బింబం ఇంట్లో...
దేశంలో యువకుడు పాలకుడి ప్రతి బింబం...
యథా రాజా తథా ప్రజా...కాస్త మార్చి తథా యువకా అన్న మాట. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని వారి ముందు తరం, మాట చేత వారు అనుకరిస్తున్నారు.
అంతలో ఇంకా కొంత అదృష్టం కాస్త విజ్ఞత, సంయమనం చూపిస్తున్నారు మన దేశంలో కొంతమంది యువత నేడు. అది ఎందుకంటే అలాటి యువత వారి ముందు తరం కన్నా కాస్త ముందుకు వెళ్ళి మాకు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఆదర్శం అంటున్నారు.
ఆ ముగ్గురు మహనీయులు లేకపోతే దేశం మొత్తంగా మన యువత ఈ సరికి తుప్పలు పట్టేసి ఉండేవారు.
మొత్తానికి సారాంశం ఏమిటంటే
అసలు
యువత, పిల్లలు పెద్దలని ఎదిరించి ప్రశ్నించారు అంటే ముందు ఆ పెద్దలు తమను తాము ఆత్మ విమర్శ చేసుకోవాలి అని అర్థం ...
వారు పాలకులు అయినా సమాజంలో పెద్దలు అయినా, ఇంట్లో తల్లి తండ్రులు అయినా తమ మాటలకి , చేతలకి నైతిక బాధ్యత వహిస్తూ తమ తరవాతి తరాల ప్రశ్నలకి సహనంతో సమాధానాలు చెప్పాల్సిందే అన్నది ముందు నేడు పెద్దలు నేర్వవలసిన పాఠం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి