నోరుంది కదా అని సమయం, సందర్భం చూడకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా నోటికి వచ్చినది మాట్లాడకూడదు అంటారు పెద్దలు.
ఈ సందర్భం లో ఒక చిన్న కథ ప్రస్తావిస్తాను.ఒక పాన్ షాపు దగ్గర పాన్ కోసం వచ్చిన ఒక వ్యక్తి పాన్ కట్ట మని అక్కడ వున్న అరటి పళ్ళ గెల మీద చెయ్యి వేసాడు.
ఆ షాపు యజమాని "పళ్ళు రాలగలవు." అన్నాడు. దానికా వ్యక్తి వెంటనే "దవడ వాచ గలడు." అన్నాడు.
అంతే ఇద్దరూ కలబడి
పోబోయారు.ఈ లోపల అక్కడికి వచ్చిన ఒక పెద్దాయన పరిస్తితి చేయి దాటుతోంది అని గుర్తించి
"అదేమిటి పళ్ళు రాలగలవు అనటం తప్పు కాదా అంటే అరటి పళ్ళ గెలలో పళ్ళు రాలగలవు అండి.జాగర్త." అని చెప్పాను అన్నాడు షాపు వాడు.
అది విన్న ఆ రెండో వ్యక్తి "పాన్ లో సున్నం ఎక్కువ వేయకు. దవడ పొక్కి పోయి వాచి పోతుంది." ఆని చెప్పాను అన్నాడు.
"అదటయ్యా అసలు సంగతి.ఇక తగ్గండి." అని సర్దుబాటు చేశాడు ఆ పెద్దాయన.
అయితే ఆ టైం కి ఆయన అక్కడి వచ్చాడు
అదృష్ట వశాత్తూ పరిస్తితి చక్కబడింది.లేకపోతే..
లేకపోతే భావోద్వేగాలు అదుపు లో వుంచుకోలేని ఆ తొందరపాటు వ్యక్తులు ఇద్దరూ రక్తాలు కారే లాగ తన్నుకుంటారు. వారి వారి వర్గాల వాళ్ళు కసి, ద్వేషం పెంచుకుని అక్కడ అశాంతి సృష్టిస్తారు.అది తరవాత ఒక ఆరని రావణ కాష్టం గా పరిణమిస్తుంది.
అలాటి వర్గ వైషమ్యాలు, బుద్ధిహీనతలు, నిత్య కత్తి కోతలు, రక్త చరిత్రలు తెలియని దేశం, ప్రాంతం భూమి అంతా వెతికినా కనబడవు.
అందుకే అతి ముఖ్యం గా ఎక్కడ, ఏది ఎంతవరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడటం సమాజం లో బాధ్యత గల వ్యక్తులు, ఎక్కువ జనాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ తప్పని సరిగా అలవాటు చేసుకోవాలి అనేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి