14, అక్టోబర్ 2026, బుధవారం

కొందరికి మనం ప్రాముఖ్యత ఇచ్చి...

 కొందరికి    మనం ప్రాముఖ్యత ఇచ్చి వారికై మన కాలాన్ని , శక్తి నీ వెచ్చించి పాటు పడే టప్పుడు  వారికి అర్ధం కాదు. 


మనం మనకి చేయడానికి  పనీ పాటా లేక వారి కోసం మన సమయం , శక్తి వినియోగిస్తున్నాం అను

కుంటారు  తప్ప ,ఒక సరి అయిన అవగాహ

నతో, సత్సంస్కారం తో , మనం వారి కొరకు మన దైన  కొంత కాలాన్ని , మన శక్తినీ మన పై ఎన్ని 

వత్తిడి  లు వున్నా , వీలుచేసుకునికేటాయిస్తు

న్నాము  అనే స్పృహ అటు వంటి వారిలో ఉండదు.

🌹🌹🌹🌹🌹🌹


ఈ పోస్ట్ కింద వ్యాఖ్యలు చూసాక నా వివరణ ఇవ్వ వలసిన అవసరం నాకు అర్ధం అయింది.


నిజానికి ఈ పోస్ట్ నేనేదో వ్యక్తిగతం గా బాధ పడి పెట్టింది కాదు.ఈ పోస్ట్ ఇక్కడ పెట్టటానికి ప్రేరణ నేను నిన్న చదివిన ఒక కథ.


ఆ కధలో బాల్యం నుంచి కలిసి ఎదిగిన అబ్బాయి, అమ్మాయి కధ. చిన్నప్పటినుండి కలిసి పెరిగి యుక్త వయసు వచ్చి పెళ్లి చేసి కుందా మన్న  ఆలోచన కూడా ఉన్న స్థితి లో ఆ అమ్మాయి మనసు మార్చుకుని   కాస్త ఆర్థికం గా బావున్న అతనిని  పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది.ఇతని మనసు గాయపడుతుంది.


ఈ లోపల ఆమె ఒక బిడ్డకు తల్లి అయి భర్త ని పోగొట్టుకుని మళ్లీ పుట్టిల్లు చేరుతుంది. "గాలి వీచి పూవుల తీగా నేల వాలి పోగా జాలి వీడి అటులే దాని విడిచి వేతునా ! వీల్లేదు!", అంటూ మళ్లీ ఈ అబ్బాయి ఆ అమ్మాయికి అన్నీ తానే అయి వెన్ను దన్ను గా నిలబడి ఆమెకి ఓ ఉద్యోగం కూడా చూసి ఆదుకుంటాడు. దానికి ఆ అమ్మాయి ఉబ్బి తబ్బిబ్బు అయి పోయి "నిన్ను కాదని నేను ఎంత తప్పు చేశాను.అసలు నిన్నే చేసుకోవలసింది. ",అని కూడా అనేస్తుంది ఒక దశలో.


దాంతో  మళ్లీ ఇతని లో ఆశల పూలు అడ్డు ,ఆపు లేకుండా విరిసి పోయి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు.

ఈ లోపల ఆ అమ్మడికి తనతో పనిచేస్తున్న ఆర్థికం గా పరిస్తితి బాగున్న మరొక వ్యక్తి తో పరిచయం అయిపోవడం ,ఆర్ధిక భద్రత ,తన,తన బిడ్డల సౌఖ్య మైన భావి జీవితం కోసం ఆవిడ అతనిని పెళ్లి చేసుకు వెలిపోవటం జరుగుతుంది.


మన హీరో నీ సుఖమే నే కోరుతున్న అని పైకి పాడి నా లోపల ఆశలు ఉంటాయి అందరికి అవి నెరవేరేది  కొందరికే అని అక్కినేని స్టయిల్లో పాడుకుంటూ..దగ్గు కుంటూ బాధ పడుతూ

తన ఇంట్లో మిగిలి పోతాడు.


నిజానికి ఈ కధలో ఆమె పరం గా ఆర్ధిక అంశాలు,అవకాశ  వాదిత్వం కనిపిస్తున్నాయి.


ఇక ఆ అబ్బాయి పరం గా ఒక సారి దెబ్బతిన్నాడు ఆమె వలనే.మళ్లీ ఆమె ను అవసరం లో ఆదుకున్నాడు. ఆమె మనస్తత్వం గురించి అవగాహన ఉన్న వాడే.అయినా రెండో సారి సాయం చేసాడు. ఆశపెంచు కున్నాడు భంగ ప డ్డాడు.


ఎక్కడ ఆశ ఉందొ అక్కడ నెరవేరక భంగ పడే సంభావ్యత కూడా ఉంటుంది.అది ఈ మె విషయం లో మరింత ఎక్కువ గా వుండే అవకాశం ఉంది అని కనీసం తన గత అనుభవం నుండి అయినా అతను నేర్చుకోలేదు.అది అలా పక్కకు పెడితే..


నేను ఇక్కడ అతని అనుభవం దృష్ట్యా ఇలాటి వ్యక్తులు వుంటారు. వారిని గుర్తించి వర్తించటం మంచిది అని అనుకుని ఈ పోస్ట్ పెట్టాను. అంతే . 


మనని ఒకరు బాధ పెట్టారంటే బాధ పెట్టిన వాళ్ళది తప్పు కాదు.బాధ పడటం మన బలహీనత.


ఇక ఒక సారి దెబ్బతిని మళ్లీ ఆ పనే చేసేటపుడు అలాటి పర్యవసానం వస్తుందేమో అని  తట్టుకుందికి మానసికం గా తయారు గా ఉండాలి.


ఇవేవీ ఆలోచించ కుండా అర్హత,అనర్హత యోచించ కుండా సమయం,శక్తీ,ఆర్ధిక వనరులు వెచ్చించి అడుగులు

వేసేటప్పుడు ఎలాటి పర్యవసానం అయినా ఎదుర్కొనే  పరిణితి లేకపోతే 

ఇలాగే బాధ పడతారు.


నన్ను వాడుకుని వదిలేశారు లాంటి భావనలు  తప్పు. ఆ అబ్బాయు అవకాశం ఇవ్వ కుండా అతనిని ఆ మె వాడుకోలేదు.


ఇక ఆమె పరం గా అంత లా తన కోసం సర్వస్వం ఇచ్చిన అతనిని "నిన్ను చేసు కోవలసింది "అని కూడా అని తన దారి తాను,కారణాలు ఏవైనా ,చూసు కోవటం సమంజసం కాదు .అతనికి స్పష్టం గా తన ఉద్దేశ్యం చెబితే  వచ్చే సహాయం అందకుండా పోతుందనో ఏమో వీలయినంత ఉపయోగించుకుని వెళిపోయింది.ఇలాటి అవకాశ వాద మనస్తత్వాలు ఈ రోజుల్లో  కోకొల్లలు.

గుర్తిం చి  జాగర్తగా వ్యవహరిచటమే దీనికి పరిష్కారం. 


ఎన్ని విశ్లేషణలు చేసిన వ్యక్తుల మనస్తత్వాలు ను ప్రభావితం చేసేవి ఎన్నో అంశాలు వుంటాయి .ఒకటో రెండో పార్శ్వాలు తెలిసి తీర్పు లిచ్చేయ లేము అనేది సుస్పష్టం గా అర్ధం చేసుకోవలసిన అంశం అని నా అభిప్రాయం.


స్పందించిన అందరికి వ్యక్తిగతం ప్రతిస్పందిస్తాను అని విన్నవించుకుంటూ


కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...