మొన్న మా పక్కింటి వ్యక్తి ఒకరు
శిరీషా బండ్ల ఇండియన్ అమెరికన్ మహిళ జులై 11 న Galactic's Richard Branson VSS Unity వారి బృందం తో కలిసి న్యూ మెక్సికో నుండి అంతరిక్షం లోకి ప్రయాణించ బోతోంది.
ఈ 34 ఏళ్ల ఏరోనాటికల్ ఇంజినీర్ ఇండియన్ అమెరికన్ కావటం మనకి గర్వకారణం. మన తెనాలి లో పుట్టినా
ఇంగ్లీష్ లో చదువు కోబట్టి కదా ఈ విజయం సాధించింది. ఇదే తెలుగు మీడియం లో చదివి ఉంటే ఇది సాధ్య పడేదా అన్నారు. ఆమాట నాలో ఎన్నో ఊహలు రేపింది. శిరీషా కి అభినందనలు, శుభాశీస్సులతో...
నా తలపులు మీతో పంచు కుంటున్నాను.
తెలుగు లో చదివి అసాధారణ విజయాలు సాధించిన వారెవరయినా ఉన్నారా?
అసలు అలాటి గొప్ప విజయాలు సాధించ లేక పోవటానికి కారణం తెలుగు లో ,అదే మాతృ భాష లో చదవటం ఒకటే కారణమా?
ఇక త్వరలో తప్పనిసరిగా రాష్ట్రం లో అందరూ ఇంగ్లీష్ మీడియం లోనే చదివి తీరాలి అనే ప్రతి పాదన అమలు చేసినంత మాత్రాన మనని విజయ పరం పరలు వరించేస్తాయా?
ఒక వ్యక్తి అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించటానికి వెనక నేపద్యాలు చాలా సునిశితంగా అధ్యయనం చేయ వలసిన అవసరం ఉంది అనిపిస్తుంది. మాతృభాష లో చదవటం వలన మట్టి గొట్టుకు పోతున్నారు అనే ఒక మాట తో కొట్టి పారేయటం న్యాయం కాదేమో పునరాలోచించాల్సిన అవసరం ఉంది
పంచ భక్ష్య పరమాన్నాలు పసిడి కంచం లో పెట్టాను. పాలన్నా పెరగడు, పెరుగన్నా పెరగడు బిడ్డ అని నెత్తి కొట్టు కుందట వెనకటి కి ఒక తల్లి.
అలాగా ప్రతి బిడ్డ విద్య కోసం మీద సుమారు ఏడాదికి లక్ష రూపాయలు
ఖర్చు పెడుతోందట ప్రభుత్వం.ఇదీ ఆ పెద్దాయన ఉవాచే. ఖర్చు పెట్టి కంచం నింపేస్తే చాలా. బిడ్డ తినే సామర్ధ్యం ,అరుగుదల శక్తి గురించి అవగాహన ఉండ నక్కర లేదా?
విద్య అనేది కుండ నింపినట్లు కుర్రాళ్ళ బుర్ర లను పాఠం చెప్పే వాడికే రాని భాషలో, అతనికే అర్ధం కాని విషయాన్ని క్లాస్ రూమ్ ల్లో వివిధ నైపుణ్యాలు, అవగాహనా స్థాయి లు ఉన్న పిల్లలిని కుక్కేసి వాళ్ళ చేత వల్లె వేయించి నింపేయటం కాదు కదా.
ప్రశ్నించే,శోధించే, సాధించే తత్వాలని
మన విద్యార్థులలో మన పెంపొందించ గలుగుతున్నమా? పఠనాశక్తి వృద్ధి చేయ గలుగుతున్నమా??..
అని మనని మనం నిజాయితీ గా నిలదీసు కోవాలి.
ఒక సారి వెళ్ళి మన విద్యా సంస్థ లలో ఉపాధ్యాయుల భాషా జ్ఞానం, విషయ పరిజ్ఞానము ఎలా వుందో చూసి తరవాత మాట్లాడాలి.
ఇంగ్లీష్ పక్కన పెట్టండి. తెలుగులో అసలు సరిగా రాసి, మాట్లాడ గలుగుతున్న, పుస్తకం చూసి ధారాళంగా చూసి చదవ గలుగుతున్న బోధకులు, మన సమాజం లో వ్యక్తులు ఇంటా, బయటా ఎందరో ఒకసారి డేటా తీయండి. అందులో కారణాలు ఏవైనా
ఎందరు ఇతర వ్యాపకాలు పక్కన పెట్టి అంకిత భావం తో, నిబద్ధత తో పని చేయ గలిగే సంకల్పం, పరిస్థితి ఉన్న వ్యక్తులు ఎందరో లెక్క కట్టండి. అలాటి శిక్షకులు గురించి ముందు ఆరా తీయండి.
మన నేపధ్యం, మన కున్న వనరుల శక్తి సామర్ధ్యాలు ఇవేవీ లెక్క పెట్ట కుండా తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికే మన రాష్ట్రం అన్ని విధాలా అధోగతి దిశ లో అడుగేస్తోంది. ఎంతో విలువైన మానవ వనరులు దుర్వినియోగం అవుతున్నాయి.
ఈ కరోనా నేపధ్యం లో ఆన్లైన్ విద్య అని మరో తప్పని సరి తనం దాపురించింది. అది అందు బాటు లో లేని అసంఖ్యాక జనం మన పల్లెల లో తుప్పలు పట్టి తిరుగు తున్నారు. ఈ పరిస్థితి ని మరింతగా దురవస్థ పాలు చేయని విధి విధానాలు ఆలోచించాలి ప్రభుత్వాలు.
అమ్మ ఒడి, ఆశిరమ్మ గుడి అని ఇచ్చే డబ్బుల లో ఆమ్యామ్యాలు.పోగా మిగి లినవి తెచ్చి బట్టలు, వెండి, బంగారాలు కొనుక్కుంటు న్నారు. అది వేరే కధ. వేరే పోస్ట్ లో ఎప్పుడో ఉబికి వస్తుంది.
ఇలా ఉచితాలు తో ఉట్టికి ఎగర లేరు కనీసం. స్వర్గాని కి అదే అంతరిక్షానికి కెగర గలరా?. ఎగర లేరు కనక...
ముందు క్షేత్ర స్థాయి లో సమస్యల పట్ల దృష్టి సారించి...
ఇప్పుడు బడు లు మూత పడ్డాయి కాబట్టి...
రేడియో ,టీవీ లు కొంత ఉపయోగ పడే అవకాశం ఉంది.
ఇక ఇంటర్ నెట్ లాప్ టాప్ లు ఫోన్ లు ఇవి అందరికీ అందుబాటు లో లేవు. పైవన్నీ ఉన్న చోట సరిగా వినియోగిష్టిన్న దాఖలాలు లేవు. చక్క గా ప్రభుత్వం ఇచ్చిన వాటి ని వాడుకుంటూ సీరియల్స్, పోర్న్ సైట్స్ విస్తారం గా. చూస్తున్న లీలలకు కొదవ లేదు.
అందుచేత రేడియో, టీవీ ల లో పనికి మాలిన నెగటివిటీ పంచుతున్న అంశాలు తగ్గించి పాఠాలు విద్యార్థు లకు అర్ధమయ్యే రీతి లో ఉన్న వాటిని విస్తారంగా ప్రసారం చేస్తే కనీసం ఓ రెండు శాతం విద్యార్థు లయినా బాగు పడతారేమో. అందులో కనీసం ఒక్కడైనా అసాధారణ కాకపోయిన ఆలోచన సవ్యం గా ఉండేలా రూపు దిద్దుకుని భావి లో మరి కొంత మంది కి. ఉప యోగ పడే ఆలోచన లు చేయ గలిగే సత్తా సంపాదించుకోగలుగు తాడేమో. అలా మనదైన స్థాయి లో చిన్నవైనా మనం నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు రచించటం, ఆచరించటం మొదలెడదాం.
అలాగే పల్లెల లో గ్రంధాలయాలు పునరుద్ధరించి వాళ్ళు ఇళ్ళకి పుస్తకాలు
అద్దె కి ఇచ్చే వెనకటి పరిస్థితి ని మళ్ళీ కాస్త విస్తృతం గా కల్పించి ఉత్తమ సాహిత్యం చదివే వీలు కలిగిస్తే ఆ పల్లె లో ఓ రెండు శాతం చదివే సంభవ్యత వుండ వచ్చు. ఆందులో వెలిగిన ఒక్క దీపం భావి లో మరెన్నో దీపాలు వెలిగేందుకు దోహద పడ వచ్చు.
ఎన్నో ఉచితాలకి ఊది పారేస్తున్న మన నిధులు కాస్త ఎక్కువ మంది లో
మేధో వికాసం కల్పించి, పని సంస్కృతి పెంచే మార్గా లలో ఉపయోగించే పద్ధతులు పునరాలోచించ వచ్చు.
Better late than never.
మన ప్రజకి రూపాయి ఊరికే ఇవ్వక ఆ రూపాయి సంపాదించుకునే విధి విధానాలు రూపొందించు కుందాం.
ఈ రోజు నాలో ఊహాలు ఈ దారి లో
వెళ్ళాయి. ఇంకేమైనా మంచి సూచనలు, సలహాలు ఉంటే చెబితే అర్ధం చేసుకుంటాను. ఇప్పటికి సెలవు తీసు కుంటూ...
ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింక్ లో వీడియో చూడండి.
https://youtu.be/6DNiWhDwoCo
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి