13, అక్టోబర్ 2026, మంగళవారం

నువ్వు ఎంత బిజీ గా ఉన్నా

 నువ్వు ఎంత బిజీగా ఉన్నా, ఎలాటి పరిస్థితి లో ఉన్నా కనీసం ఒక పోస్ట్ అయినా పెడతావు.

అవసరమా? ఖాళీ లేక పోయినా, నీకు కుదరక పోయినా, నీలో రాసేందుకు సరుకు లేక పోయినా, 

నువు రాసింది కాక పోయినా ఎవరిదో ఒకరిది షేర్ చేసి తీరాలా? చూడలేక చస్తున్నాం!  అని ఒక సగటు భారతీయుడి ప్రశ్న...

భారతీయుల ఇలాటి ధోరణి వలనే భారతీయుల పై ఇతర దేశాల వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు...

నాకేది అవసరం అనేది నేను చూసుకుంటాను.కానీ నువ్విలా నన్ను ప్రశ్నించి నా వ్యక్తిగత పరిధి లో కి రావటం నీకు అనవసరం. అనుచితం. 

నా వాల్ నా ఇష్టం. నీ కిష్టం లేక పోతే చూడకు. ఎవడు నిన్ను చూడమన్నాడు అని అడిగి కడిగి ఆరేసి,  చీరేసి ఉప్పు పాతర వేసాను ఆ అతి వాగుడు వాగిన  మతి మాలిన మానవుడిని  కానీ...

ఏది అడగాలి, ఎక్కడ నోరు మూసుకోవాలి అనే స్పృహ మన పౌరులలో బొత్తిగా లేదు కదా అనిపించింది అతగాడికి  తీరుకి...అనుకోండి.

అవును నేను రాసిందో, మరొకరి పోస్టో ...

నేను నా వాల్ మీద రోజూ పోస్ట్ పెట్టటం నా అవసరం...ఆశయం...

రోజుకి మూడు, నాలుగు కాకపోతే నా కిష్టం వచ్చినన్ని, fb వాడు  allow చేసినన్ని పోస్ట్లు పెట్టటం నా అలవాటు. అది పూర్తిగా నాకు అభిమతం. అందులో ఇతరులకు ప్రమేయం అనవసరం అని  పై శాల్తీ లాటి ప్రబుద్ధులు అర్ధం చేసుకోవాలని మళ్ళీ ఈ రోజు ఈ పోస్ట్ ఇక్కడ..ఇలా...

అతగాడికి , అత గాడి లాటి  అనవసర ప్రశ్నలు వేసే ప్రబుద్ధులకి తమకి నచ్చని పోస్ట్లు స్కిప్ చేసే వెసులు బాటు ఉందని మరో సారి గుర్తు చేస్తూ...

నాలో సరుకు ఉండటానికి నేనేమీ పెద్ద అధ్యయనం చేసిన వ్యక్తిని కాను. కానీ నా మనసుకు తోచింది, నేను చూసింది, విన్నది నా మాటల్లో  నా వాల్ మీద పెట్టటానికి   నాకు fb అవకాశం ఇచ్చింది. అది పూర్తిగా వినియోగించుకోవాలి అన్నది నా భావన. అదే ఆచరణలో పెడుతున్నాను  అని గతం లో సవా లక్ష సార్లు చెప్పాను... మళ్ళీ అదే చెబుతున్నా.

అధ్యాపకురాలి గా చేసిన వ్యక్తి నీ కదా అర్ధం ఆయే వరకూ ఎన్ని సార్లైనా చెబుతూనే ఉంటాను మరి...

ఈవిడ పోస్ట్లు సోది, టైమ్ వేస్ట్ అనుకుంటే చూడటం మానేయండి.

నేనిలాగే రోజూ పోస్ట్లు పెడుతూనే వుంటాను..

వుంటనర్రా..మరి

ఇట్లు మీ స. స....అంటే సత్తెకాలపు సత్తెమ్మ

కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...