నాలుగు వారాల నుండి మన పొన్నాడ వారి
పున్నాగ వనం గ్రూప్ లో నిష్ణాతులు ప్రతి సోమవారం,మంగళ వారం
తెలుగు లో ఛందస్సు తో పద్యాలు రాయటం నేర్పించు తున్నారు. ఆ-ఆ ల నుండి మొదలు పెట్టి విషయాలు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టిన విధం గా నేర్పిస్తున్నారు. అక్కడ గత సోమవారం ప్రాస నేర్పే సందర్భం లో ప్రసవ వృత్తం అని
స గణం ,స గణం
I I U I I U...అంటే రెండు స గణాలు..
ప్రతి పాదం లో రెండో అక్షరం కు ప్రాస నియమము ఆ వృత్త లక్షణం ..అంటే నేను చేసిన చిన్న ప్రయత్నము ఈ క్రింద చేర్చాను.
అతి హృద్యమైన మన తెలుగు పద్య సౌరభాల్ని పదిల పరచి పరిరక్షిస్తున్న,వ్యాప్తి చేస్తున్న ఎందరో మహానుభావులు...
వారందరికీ భక్తి పూర్వక అభి వాదములతో...
కనులే కలిపా
నినులో నిలిపా
జనమే మనునో
అనకే సఖియా
కలలే కరిగే
ఇలలో వగపే
చెలినే కనకా
వలపే చెదరే
కలవా లనుచూ
పిలిచే కలువా
చెలిమే కలిమై
కలువే ముదితా
చలిలో జతకై
చెలికై వెతికా
అలిగీ వెడలే
కలికీ వినవే
కలిమీ చెలిమీ
బలిమే నెలతా
కలసీ మెలసీ
మెలుగే వెలగా..
దోషాలుంటే తెలియజేస్తే సవరించు కుంటానని వినమ్రం గా తెలియజేసుకుంటూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి