17, అక్టోబర్ 2026, శనివారం

ఈ రోజు మహిళా దినోత్సవం కదా...

 ఈ రోజు మహిళా దినోత్సవం కదా..

నువ్వు పోస్ట్ పెట్ట లేదేమీ అంటూ..


మా కజిన్ పొద్దున్నే ఫోన్...


ఏముందక్కా పెట్టటానికి...

మన తరానికి చెందిన 

ఓ సినీ కవి రాసిన..

ఆడది కోరుకునే వరాలూ 

రెండే రెండు ;-

చల్లని సంసారం, చక్కని సంతానం ..


అన్న దశ నుండీ..


"బాబూ!! స్త్రీ ఏమి కోరుకుంటుందో స్త్రీ చెబుతుంది. నువ్వు చెప్ప నక్కర లేదు." అంటూ 

స్త్రీలు చేసిన ప్రయాణం లో


ఎన్నో మైలు రాళ్ళు అధిగమించి స్త్రీ చేరిన ఈ మలుపు లో...


ఆమె...


నేనూ నేటి మహిళ ని

మహా మోటు మహిళ ని

ఇంటా, భయటా 

చేతకీ, నోటికీ అడ్డూ,ఆపు

లేకుండా 

ఎవరు ఏమి చెప్పినా విన కుండా...


నాకూ, నా సంబంధీకులకు అనేక సమస్యలు సృష్టించు కుంటున్న  మూర్ఖత్వాన్ని..

సర్దుబాటు, దిద్దుబాటు ని చేతకాని తనం గా భావిస్తూ..

ఎక్కడ ఎగరా లో, ఎక్కడ ఒద గాలో...తెలియని తనం తో..


తప్పు అమ్మా..ఇబ్బందుల్లో పడతారు అంటే..దాన్ని

అణిచి వేత  అని అరుస్తూ..

పెళ్ళి పందిరి తీయకుండానే విడాకుల కోసం పరుగు లెడుతూ....

సంసారాలు బజారు పడేస్తూ..


మహిళల రక్షణ కి ఏర్పాటు చేసిన చట్టాల ముసుగులో

అబద్ధపు ఆరోపణలు చేస్తూ, కొండొక చో భర్తనూ, అత్తింటి వారి నీ అప్రతిష్ట పాలు చేస్తూ, శిక్ష ల కు గురి చేస్తూ..


విచ్చల విడి తనానికి స్వేచ్ఛ అని పేరు పెట్టి విపరీత పోకడలు పోతూ..


నాగులు తిరిగే కోన సమాజం అని తెలిసీ కనీస ఆత్మ రక్షణ పద్ధతుల ను పాటించక...


తమ తప్పుల కు సమాజాన్ని,  తమ సంబంధీకులనీ నిందిస్తూ...


ప్రతి క్షణం మోసపోతూ, అత్యాచారాలకు గురి అవుతూ, ఊసురులు ఎగిసి పోతున్నా కూడా...


చూసి నేర్చుకుందాం అనే స్పృహ లేకుండా...


జీవించటానికి అవసరం అయిన తెలివి గల మాటలు, చేతలు నేర్చు కోక..


మీ బుద్ధే వంకర బుద్ధి అని ప్రపంచాన్ని నిందిస్తూ..

పెడసరి తనం, బాధ్యతా రాహిత్యం, కుటుంబం,సమాజం పట్ల ఉండ వలసిన కనీస మైన మానవీయ దృక్పధం లోపించిన నేటి మహా మోటు మహిళ లను చూస్తుంటే...


వారి ముందు తరం వ్యక్తి నైన

నా లాటి వారికి  ఏమీ మాట్లాడాలి అనిపించని మాట వాస్తవమే అక్కా..


కానీ ఈ మాట మనం అంటే మహిళా సంఘాలు స్త్రీ కి స్త్రీ యే శత్రువు అని మన మీద దండెత్తు తారు.


మనమూ ఉద్యోగాలు, గృహ బాధ్యతలూ నిర్వహించాము. కానీ ఇలా కేవలం హక్కుల కోసం అరిచి బాధ్యతలు వదిలేసిన తరం కాదు మనది..


ఈ తరం లో బాధ్యతలు వదిలేసి కేవలం తన గురించి తప్ప మరోటి  ఆలోచించని తరాల లో మహిళలు, తీరు ల్లో మరీ సంకుంచిత ధోరణులు వ్యాప్తి చెందుతున్న నేపధ్యం లో..


ఏదైనా  తప్పు సరిదిద్దు కోవలేమో కొంచెం చూసుకోండి అంటే..


మీ బుద్ధే వంకర బుద్ధి అంటూ తెగబడు తున్న నేపధ్యం లో...


ఇలాటి స్త్రీ ల సంఖ్య తక్కువేమో కానీ ఈ పోకడ అంతకంతకు విస్తరిస్తున్న మాట వాస్తవం.


I am ok

The world is not ok..

అనే ధోరణి వ్యాప్తి చెందు తున్న నేపధ్యం లో...


మహిళా దినం మీద నా భావాలు పోస్ట్ పెడితే..

నాకు దినం పెట్టేస్తారని పెట్ట లేదక్కా....


అన్నాను.


అందువలన చేత మౌనమె 

నా భాష...


నా వ్యక్తీకరణ లో ,ఆలోచనా విధానం లో లోపాలుంటే తెలియ జేస్తే నన్ను నేను సరి దిద్దు కుంటాను.



కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...