అసలు బేసిక్ సైన్సెస్, హ్యుమానిటీస్ , లాంగ్వేజెస్ మూడింటికి ఆదరణ తగ్గి పోయినా, ఎంసెట్ లో ఇతర పోటీ పరీక్షలలో సీట్లు రాక మరో దారి లేక డిగ్రీ కోర్సెస్ లో చేరి...
ఆశించిన కోర్స్ లో సీటు వచ్చే వరకు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తీసుకుని.. చేరే విద్యార్థుల తో...నిండిన..
రైలు కోసం వేచి ఉండే ప్లాట్ఫారం లలాగా డిగ్రీ క్లాసులు ను, డిగ్రీ కళాశాలల ను మన రాష్ట్రం లో ఎప్పుడో మార్చేశారు.
చదివే కోర్స్ మీద ఆసక్తి లేకుండా మనసొకచోట, మనువొక చోట అన్న తీరులో ఉండేది డిగ్రీ క్లాసుల లో పిల్లల తీరు.
మూడేళ్లు లో వాళ్ళు కోరుకున్న ఇంజనీరింగ్, లేదా మెడిసిన్ లో సీట్ రాక పోతే డిగ్రీ అయిందనిపించే పిల్లల శాతమే ఎక్కువ ఉండేది...
ఆ నేపథ్యంలో బోలెడు ఇంజనీరింగ్ కాలేజీలు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ ...తో తల్లి తండ్రులు వాళ్ళని పోలో మని అప్పులు చేసి మరీ ఆ కాలేజీ లలో చేర్చటం...
అక్కడ కూడా బ్యాక్ లాగులు, ఫలితాలు రాబట్టడం కోసం కాలేజీలు, విద్యార్ధులు పక్క దార్లు పట్టటం...ఇవన్నీ అడపా తడపా వార్తలలో చూసాము.
అదలా ఉంచితే క్యాంపస్ సెలెక్షన్స్ లో నియామక సంస్థలు
మన ఇంజనీరింగ్ విద్యార్ధుల, డిగ్రీ విద్యార్ధుల నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పరమ నాసి గా ఉన్నాయి అని తేల్చటం గురించి చాలా చోట్ల చదివాము.
ఇలాటి డిగ్రీ హోల్డర్స్ ఏమి చెయ్యాలో తెలియక ఉద్యోగాలు రాక ఏదో తోచిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు వెళ్ళటం...
అక్కడ కూడా పునాదులు గట్టిగా లేని తనం ...మన డొల్ల విద్యా విధాన ఫలితం గా ...
మనకి మిగిలింది సామర్థ్యం కొరవడిన, నైపుణ్యాలు కరువైన వర్క్ ఫోర్స్ మాత్రమే..
తగ్గట్లే మన దేశం లో ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టి...ఏ స్తాయి లో ఉన్నాయి అనేది జగా మెరిగిన సత్యం..
డిగ్రీ, అయినా, పీజీ అయినా నేపథ్యాలు ఏవి అయినా లోపల ఉండవలసిన స్పార్క్ లేక పోతే వ్యక్తి బతుకు లో తను వెలిగి ఇతరులను వెలిగించలేడు..
అన్నది పచ్చి నిజం..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి