17, అక్టోబర్ 2026, శనివారం

ఏదైనా టైప్ చేద్దాం అని కూచుంటామా

 ఏదైనా టైప్ చేద్దాం అని కూచుంటామా

ఒకటి టైప్ చేస్తే మరోటి పడుతుంది

కొన్ని సంయుక్తా క్షరాలు టైప్ చేయటానికి తల ప్రాణం  తో క్కి వస్తుంది. 

ఎడిటింగ్ చేస్తే ముందున్న వాక్యమో, తరవాత వచ్చిన అక్షరాలు ఏవేవో వచ్చేయటమో జరుగుతుంది.

ఇంతా పదం కష్టపడి టైప్  చేసాక మనకి కావలసినది తప్ప వత్తుల తేడాలతో అన్ని ఆప్షన్స్ మనం ఎంచుకుందికి సిద్ధం గా ఉంటాయి. అవన్నీ ఆశ  గా వెతికి మనకి కావలసిన పదం మనం ఆశించిన తీరు లో లేదని తెలుసుకుని అప్పుడు మళ్ళీ రాయడం , గుణింతం మోడ్ లలో గుణింతం మోడ్ సెలెక్ట్ చేసుకొని పదం టైప్ చేసుకుందాం అని తంటాలు పడుతుంటామా. మెసెంజర్ లో ముఖాలతో  పాత సినిమాల్లో చందమామల్లో నటుల ముఖాల లా

ముఖా లెట్టుకుని 'రావోయి చందమామలు' కీ బోర్డ్ మీద అక్షరాలకు అడ్డు తగులుతూ...

పొరపాటున వేలు పడి ఎవడి మెసెంజర్ లోదో చాట్ బాక్స్ ఓపెన్ అయి పోయి ఇహ వాడు మనం ఇష్ట పూర్వకం గా వాడి చాట్ బాక్స్ తెరిచా మానుకుని మొదలెడ తాడు నస. 

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అని

తలలో పుట్టిన తలపు పురిట్లో నే సంధి

కొట్టడానికి లక్ష కారణాలు.

"సరే ఆ బాల పాప చిన్నెలన్నీ తట్టు

కుని బతికి బట్ట కట్టిన ఏ చిన్న

ఆలోచన నో పదాల్లో పొదిగే ఈ టైప్ కార్య క్రమం లో ఈ చిత్ర విచిత్ర విన్యాసాల కు గురి అయి ఆ యింతా మనం అనుకున్నది మనసు వీడి ఎటో వెళి పోతుంది. అనుకున్నది ఒకటి అక్షర మైనది ఒకటి అయి పోతుంది.

భావాలు ఉల్కలే. ఇప్పుడు కాయితాలు లేవు. వెంటనే అక్షరం గా అవతరించక పోతే ఏ కాగితం మీదో, తెర మీదో వాలక పోతే రాలి పోతాయి.

కాల గర్భం లో కలిసి పోతాయి.

నాలాటి  మొబైల్స్ తప్ప మరేమీ  అందుబాటు లో ఉండని వారికి ఊహ తెర మీద అక్షర  మయే లోపల లక్ష రకాల గృహ కార్యాలు. ఇల్లాలి మీద ఆధార పడిన   వాళ్ల ఆర్త నాదాలు. దొరికే అతి తక్కువ  ఖాళీ

టైం లో ఇతరుల పోస్ట్ లు చూసి స్పందించటమా, మనకి తోచిన విరాయటమా అని తర్జన పర్జన పడటం లో మరో కొన్ని క్షణాలు ఉష్ కాకీ ఈ పోతాయి అనుకోండి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే...

టీ పెడుతుంటే వచ్చిన భావం టింగ్ రంగా అని వెంటనే పోస్ట్ అయి పోదు.

తరవాత కూర తరుక్కుని, బ్రేకఫాస్ట్  ప్రిపేర్ చేసుకుని, మంచినీళ్లు పట్టుకుని ఇలా 'కునీ' లు ఎన్నో ముగించుకు వచ్చి టైప్ చేదామను కునీ సరికి...

మనం ఛార్జింగ్ కి పెట్టిన  మొబైల్ తీసేసి మరొకరు తమ మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి, వాళ్ళ పని పూర్తి అయ్యాక మన మొబైల్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలనే ఊసే  లేకుండా ఉడాయిస్తారు.  

మనం ఆనాటి భవ సాగర ఈత ముగించుకు మన  చరవాణి ని చేతబూనిన గానీ మనకి సత్య దర్శనం కాదు. దాని జడ పరిస్థితి  చూసి మనలో అలజడి  అత్యధిక శక్తి స్థాయి కి... 

అంత ఉత్తేజిత స్థాయి కి

మనసు వెళిపోయినా...

అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు కదా! క్రోధం, స్మృతి భ్రంశం, బుద్ధి  నాశం అనే  తాత్కాలిక దశల్లో( meta stable states)  రగిలి, పొగిలి, అలసి,సొలసి...

మనం ఎంత 

ఎగిరి నా ఎవడూ పట్టించు కోడని జ్ఞానోదయం ఆయాకా...

చేసేది లేక మన మొబైల్ ఛార్జింగ్ లో పెట్టి ఈ లోపల మరో పని చూసుకు వచ్చి...

టైప్ చేద్దా మంటే ...

ఇందాక పని లో  పరవళ్ళు తొక్కిన  మనసు ...

 తలుపులు గట్టిగా మూసేసుకుని "తలపులూ లేవు, గిలపులూ లేవు పో."అంటుంది.

నిజం గా ఈ పాట తో గొప్ప తంటా!...

పని లో ఉన్నపుడు పదే పదే పలకరించే పాట..

కావాలని పిలిస్తే కనబడక  వ్యధే మనకి

అంటా!!

ఇది నా స్వానుభవం.

మరి మీరే మంటారో గానీ...

ఏమైనా గానీ...

"మనసులో పుట్టిన ఊహని

చటుక్కున పట్టేసుకుని

లటుక్కున గోడ కి కొట్టేయండి  సుమీ!"...

కాచి వడ  బోసిన అనుభవం తో

పొద్దు న్నే కాకిలా అరిచి గోల చేసి

మరీ చెబుతున్నా...

"ఎహే! ఇవన్నీ నీకంటా మాకు బాగా తెలుసు గానీ పోయి పన్జూసుకో !" అంటారా...

"అలక్కా నీయండి బాబూ!ఎల్లొత్తా!!!😀😀😀



కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...