రాగ మేదో ఎదను తాకగ
పులకరించెను ఏమిటో ఇది
తీగ నేను గ పంది రల్లగ
పరిమళించెను ఏమిటో ఇది
ఆగ లేనని ఆప బోకని
కూడ దన్నా కాదు కాదనె
వేగ తరలగ వలపు సీమకు
తొందరించెను ఏమిటో ఇది
మరులు రేపిన వాడు నేడిటు
శీత కన్నును వేసి పోయెను
ఇరుల రేయిన విరుల పానుపు
వెక్కిరించెను ఏమిటో ఇది
పండు వెన్నెల కాదు జ్వాలది
మల్లె పూలవి కావు ముళ్ళే
చెండుతూ ఈ విరహ తాపం
నరకమాయెను ఏమిటో ఇది
సెగలు సెగలే లోన బయటా
తగల మన్మథ శరము తనువుకు
పొగలు రేగుతు నెగడు నాలో
రగిలి పోయెను ఏమిటో ఇది
ఎదుట ఉంటే చూపు తనపై
దూరమున్నా హృదిన తానే
కుదుట పడదే ఎడద నిమిషము
దిగులు నిండెను ఏమిటో ఇది
ఆలి ఊసే లేదు వాడికి
జాలి గీలన తెలియ వసలే
సోలి పోతిని ఓ సవిత్రీ
వేదనాయెను ఏమిటో ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి