తప్పొప్పులు ఎవరివి అనేది లేక
గెలుపు ,ఓటములు ఎవరివైనా నిమిత్తం లేక
ప్రతి యుద్ధం అద్దం పట్టేది..
జడలు విప్పిన స్వార్థ, అహంకార, నియంతృత్వ, మూడత్వాలకు ..
రాలిన ఉసురులకు, పారిన రక్తపుటేరులకు, నడిచే గాయాలకు, నడవలేని ఆర్థిక వ్యవస్థలకు..
దారి తీసేది యుద్ధమే.
నెత్తు రోడే కొత్త పుటలు చరిత కు చేర్చటానికి తప్ప యుద్ధాల వల్ల ఒరిగేది ఏదీ లేదు..
యుద్ధ జ్వాల దహించి న క్షేత్రాల లోంచి బూది లో ఫీనిక్స్ పక్షుల్లా లేచి రెక్క విచ్చి సజీవ చైతన్యం తో నింగికి ఎగరటానికి ..
దేశాలు అంటే ఒక వ్యక్తి కాదు కదా..భిన్న భావజాలాలు, విశ్వాసాలు, ఆచారాలు, అలవాట్లు వున్న వ్యక్తుల సముదాయాలు.
కంచెలు నిర్మించే, ఆయుధాలు తో విజృభించే పోకడలు సంపద, ఇతరాలు అన్ని రకాల వనరుల నష్టాని కే తప్ప..
వాటి వలన ఏమీ సాధించ లేము అని స్పష్టం అవుతునే వుంది..
మనుషులు సమూహాలుగా బతకాలి..తప్పదు ..
గుంపు లో బతకాలంటే వ్యక్తుల, దేశాల మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం, ఒకరి నొకరు ఆదరించి అక్కున చేర్చకో గలిగే సంస్కారం వుండాలి.
అవి ప్రతి దేశం వ్యక్తుల లో చిన్నతనం లోనే పాదు కొల్పాలి. ఇంటా, బయట.
అది చేయటానికి అందరికన్నా అత్యధిక అవకాశం మోసి ,కని, పెంచిన తల్లులకు వుంది. ఆమె తరవాతే మిగిలిన గురువులు అందరూ.
తల్లుల కడుపు కోత ఆగా లంటే...
ప్రపంచ వ్యాప్తం గా తల్లులు ఈ పనికి పూనుకునే మార్గాలు అన్వేషించుకుంటే..ఈ పందెం కోడి పుంజులు లా అవేశం తప్ప ఆలోచన లేని పురుష స్వామ్యా ల, నియంతృత్వ పోకడల కు అడ్డుకట్ట వేయాలాంటె. సాటి తల్లుల కడుపు మంటలు ఆర్పాలంటే...ఈ దుందుడుకు తనాలు మాపాలన్ టే..స్త్రీలే నడుం కట్టాలేమో..
ఈ రాక్షస మూకలను, కలుపు మొక్కలను పెరికి మానవత్వం మళ్ళీ నలుచెరగులా పాదు కొలపా లి అన్నా, ఆ దుర్గమ్మ ని శరణు అన్నట్లు..ఈ భూమి మీద స్త్రీ శక్తి నీ శరణు అని..
లోకం లో హానికర భావజాలాలు, మత మౌఢ్యలు నిర్ద్వంద్వంగా గా పక్కన పెట్టి..ఈ మదం ఎక్కిన రాక్షసులను దారికి తేవాలి అనిపిస్తుంది.
దిక్కు మాలిన భావజాలాలు, స్త్రీ లపై ఆధిపత్యం చెలాయించే ధోరణులు వల్లే..ఈ మూర్ఖులు వాళ్ళు చస్తూ, ఎవరినీ బతక నియ్యటం లేదు. ఆ ముదనష్టపు భావజాలం పిల్లల్లో కూడా జొప్పించి విలయం సృష్టిస్తు
న్నారు మత మౌఢ్యం తో..
మోసారా, కన్నారా?? ఏమి తెలుసు ఆ దౌర్భాగ్యులకి తల్లుల కడుపుకోత...దులుపుకు పోవటం, ఆబోతుల్లా రెచ్చి పోవటం తప్ప....ఒక గంట బిడ్డ ఇంటికి రాకపోతే అల్లల్లాడుతుంది తల్లి మనసు. అలాటిది అంతలా పసి బిడ్డల్ని విచక్షణ లేకుండా చంపేస్తున్నారు..ఏ దేముడు క్షమిస్తాడు ఈ నర మేధాలు చేసే వారిని..ఒక బిడ్డ విడియో చూసాను..నిద్ర పట్టలేదు..వుంది ఇక్కడ లింక్ పెడదామనుకున్నాను.ఎందుకు లే అని మానేశాను.
ఈ అసురులను దునిమే శక్తి..స్త్రీ శక్తి..వీళ్ళకి బుద్ధి రావాలంటే..కళ్ళు తెరిపించగలిగేది.. ఎప్పటికైనా స్త్రీ శక్తే.స్త్రీ కి ముసుగేసి, అణిచేసి వీళ్ళు వేస్తున్న వీరంగాలు కట్టడి చేయడాినికి ప్రపంచం లో స్త్రీలంతా ఏకం కావాలి..ముఖ్యం గా ముసుగులు తీసి పారేసి ఆ సమాజాల్లో స్త్రీ శక్తే ఇతర సమాజాల్లో స్త్రీ ల తో కలిసి ఆ దుష్ఠత్వాన్ని నిర్మూలించాలి..
ఆ వూయల వూపే చేతులు..
కాయును భావి తరములు..
అనటం లో సందేహం లేదు..అనిపిస్తుంది నా మటుకు నాకు.
సంస్కారం, సమత, మమత, స్త్రీలను గౌరవించటం లాంటివి ముందు ఇంట్లో తల్లి, తండ్రి, ప్రాథమిక స్థాయి లో గురువులు పిల్లలో నాటి, మొక్కలుగా వారిని వంచితే...
సమాజం లో చాలా వరకూ ఆశించిన మార్పు రావొచ్చు.
అయితే తల్లులకు, తండ్రులకు, గురువులకు తమ పిల్లలకి ఏమీ చెప్పాలి, ఏది చెప్ప కూడదు అనేది మీడియా, టీవీ, సినిమాలు, సామాజిక అంతర్జాల మాధ్యమాలు విసృతంగా తెలియజేయాలి. ఆ బోడి ఆదర్శాలు చెబితే ఎవరు వింటారు మీదంతా సోది అంటారు అని తెలుసు..
కానీ బండి గాడి తప్పుతున్నపుడు దారి లో పెట్టే ప్రయత్నం చేస్తామా లేదా..దానికి సురక్షిత మైన దారి వంక చూస్తామా లేదా.. మరి..
పై ప్రశ్నకి సమాధానం ఎవరికీ వారు వేసుకుంటే ....చాలు..దానికి వారు చెప్పుకునే జవాబు బట్టి ప్రవర్తిస్తే చాలు.
వ్యక్తి ఆలోచనా పరిధి విసృతం కాక, ప్రకృతి తో, సాటి జీవులతో సామరస్యం గా జీవించే విధివిధానాలు అలవరుచుకోక మానవ జాతికి దారి లేదు. ఇంగితం, విచక్షణ, సహృదయత లేక పోతే జాతికి నిష్కృతి లేదు.
చెప్పటమే నా ధర్మం..వినక పోతే మీ ఖర్మం ..
మత్తు వదలరా..అన్నారు ఒక సినీ కవి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి