కన్నే తెలియని కలలే కురిసే
ఎన్నో ఎరుగని కథలే మెరిసే
పెదవే నవ్వుల పువ్వులు రువ్వే
ఎద లో తేనెల వరదే పొంగే
రెప్పలు విచ్చిన చూపుకు విందై
రెక్కకు చుక్కల సీమే అందే
ఆగిన కాలం సాగెద ననె నే
వేగిన మది యే రాగం చినికే
తడిమే గాలికి తనువో వీణే
తడిపే మబ్బు కు తపనల వానే
ఆశల విత్తులు మొలకలు వేసే
ఆకశ విల్లులు అవనిన విరిసే
ఇదివర కెపుడూ ఇట్లా లేదే
పగలూ రేయీ కురిసే వెలుగే
రానను సూర్యుడు తానే వచ్చే
వేకువ జతగా తేకువ తెచ్చే
జడి లో సుడి లో ధైర్యం సావిత్రి
దిశ నూ దశ నూ పూర్తిగ మార్చే
శుభోదయం
అందరికీ అభివాదములు
తేకువ కి చాలా అర్ధాలున్నాయి..
ఇక్కడ నిబ్బరం అనే అర్థం లో వాడు కున్నాను
నా టపా లు సహృదయతతో
ఇష్టపడు తూ, స్పందిస్తూ నన్ను ప్రోత్ససహిస్తూ ఉన్న మిత్రులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు..
అభివాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి